హఫీజ్ పెట్ (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు, బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బాలింగ్ గౌతమ్ గౌడ్ జన్మదినం సందర్భంగా డివిజన్ ఏరియా కమిటీ మెంబర్ సురేష్ కుమార్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కంది జ్ఞానేశ్వర్, సాబేర్ మనోహర్, హుస్సేన్ లు శుభాకాంక్షలు తెలిపారు. హఫీజ్ పేట్ పార్టీ కార్యాలయంలో గౌతమ్ గౌడ్ ను వారు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో గౌతం గౌడ్ ను కార్పొరేటర్ గా చూడాలని వారు ఆకాంక్షించారు.