శేరిలింగంపల్లిలో గౌడ ఐక్యతకు పాటుపడుదాం: దొంతి లక్ష్మీనారాయణ గౌడ్

  • చందానగర్ సుప్రజ బ్యాంకెట్ హాల్ లో గౌడ సేవా ప్రముఖులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం
  • రూ.5 కోట్ల విలువైన భూమి విరాళ దాత దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ కు వెండి కిరీటంతో సత్కారం
  • గౌడ హాస్టల్, గౌడ సత్రాల నిర్మాణాలకు విరాళమిచ్చిన 43 మంది దాతలు
  • శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఘన సన్మానం
దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ తో పాటు గౌడ సేవా ప్రముఖులను సన్మానిస్తున్న శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: గౌడ కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలని, ఆ విధంగా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయాలని దొంతి లక్ష్మి నారాయణ గౌడ్ అన్నారు. ఇటీవల దొంతి లక్ష్మి నారాయణ గౌడ్ నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ కోసం రూ. 5 కోట్ల విలువైన భూమి విరాళంగా అందజేసిన విషయం మనకు తెలిసిందే. అయితే శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. చందానగర్ సుప్రజ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన గౌడ సేవా ప్రముఖులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం సభ్యులు లక్ష్మినారాయణ గౌడ్ ను వెండి కిరీటంతో సన్మానించారు. అదేవిధంగా గౌడ హాస్టల్ లో గదుల, వివిధ పుణ్య క్షేత్రాలలో సత్రాల గదుల నిర్మాణాలకు విరాళాలు అందజేసిన వారికి మెమోంటోలు అందజేసి, పూలమాలలు, శాలువాలు, వేద ఆశీర్వచనంతో సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులందరు ఏకతాటి పైకి వచ్చి మన బలాన్ని నిరూపించుకునేందుకు సభ్యత్వానికి సహ కరించాలని కోరారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కోసం సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. అలాగే 18 మంది గౌడ ప్రముఖులు గౌడ హాస్టల్ భవనం కోసం ఒక్కొక్కరూ రూ.4 లక్షల చొప్పున, యాదగిరిగుట్టలో గౌడ సత్కం కోసం రూ.1లక్ష మొదలు రూ.10 లక్షల వరకు 25 మంది విరాళాలు ప్రకటించడం పట్ల గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన గౌడ కుటుంబ సభ్యులు
  • విరాళాలు ఇచ్చిన దాతలు వీరే…
    దొంతి లక్ష్మీనారాయణ, గౌడ్, పి.అశోక్ గౌడ్, మక్తల కృష్ణ గౌడ్, నేమూరి రాములు గౌడ్, కొమరగౌని శంకర్ గౌడ్, సి.యాదగిరి గౌడ్, మూల రమేష్ గౌడ్, మూల వెంకటేష్ గౌడ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, రాచమల్ల వెంకటేష్ గౌడ్, వి.జగదీశ్వర్ గౌడ్, నందికంది కరుణాకర్ గౌడ్, రాచమల్ల శ్రీనివాస్ గౌడ్, మద్దూరి శివశంకర్ గౌడ్, మద్దూరి రాధాకృష్ణ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, చెగూరి సాయికుమార్ గౌడ్, నిమ్మల సాయికృష్ణ గౌడ్, లోతుకుమల్ల సాయికుమార్ గౌడ్, రక్తపు రాములు గౌడ్, రక్తపు జగం గౌడ్, రక్తపు కృష్ణ గౌడ్, రక్తపు వినయ్/సందీప్ గౌడ్, రాచమల్ల భాస్కర్ గౌడ్, కూన గౌరీదేవీ, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, తోకల బాలరాజ్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, కొత్తపల్లి నర్సింగరావు గౌడ్, చెట్టి సుదర్శన్ గౌడ్, మూల అంజిబాబు గౌడ్, ఎరుకల వినోద్ గౌడ్, కుకునూర్ శ్రీనివాస్ గౌడ్, బుుయ్య లింగంగౌడ్, దుర్గం వీరేశ్ గౌడ్, కూన సత్యం గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, సంఘం అమర్ నాథ్ గౌడ్, సంఘం జనార్దన్ గౌడ్, పెదగోని దనుంజయ్ గౌడ్, నరేంద్ర గౌడ్ గౌడ సంక్షేమానికి, అభివృద్ధికి ముందుకొచ్చి విరాళాలు అందజేశారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here