- డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారి చేయించిన గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: మన ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్ర పర్చుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రోగాలు దరిచేరవని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ మెట్ల కుంట చెరువులో జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారీ చేయించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. దోమల బెడదపై కాలనీ వాసులు, చెరువు చుట్టూ ఉన్న ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సూపర్ వైజర్ విశ్వా ప్రసాద్, నర్సింహులు, యాదగిరి, తిమోతి, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.