- శతాధిక కవులకు పురస్కారాలు – కవితా పోటీలు
- 20 లోగా కవితలను పంపాలని విజ్ఞప్తి
నమస్తే శేరిలింగంపల్లి: ఎస్.వీ ఫౌండేషన్ -తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సాహితీ సంబరాలు-శతాధిక కవులకు పురస్కారాలు, కవితా పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షుడు పీఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది కవితా పోటీలను తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలి నాయుడు మాస్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మీసాల చిన గౌరి నాయుడు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి హెచ్ వి రమాదేవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నవనీత రవీందర్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక గౌరవ అధ్యక్షులు లంకా వెంకటస్వామి,గంటా మనోహర్ రెడ్డి, పిళ్ళా వెంకట రమణ మూర్తి , డాక్టర్ గౌరవరాజు సతీశ్ కుమార్ పర్యవేక్షణలో హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహించనున్నామని, ఈ పోటీల్లో విజేతలకు సంస్థ తరపున బహుమతులను, ఉత్తమ కవులకు బిరుదులు, ప్రదానం చేస్తున్నదని చెప్పారు. అలాగే 116 ఉత్తమ కవితలను ఎంపిక చేసి ఉగాది పంచాంగంతో పాటు ఉగాది షడ్రుచులు కవితా సంకలనం పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖుల చే నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉగాది సాహితీ సంబరాలలో కవితా పోటీలలో కవితా అంశాలు
- 1) ఉగాది
- 2) తెలుగు భాష
- 3) మన సంస్కృతి, సంప్రదాయాలు
- 4)మహిళా సాధికారత
- 5) సామాజిక స్ఫూర్తిదాయక కవితలు అంశాలలో ఏదైనా ఒకటి ఎంచుకుని కవిత రాయలన్నారు.
- ప్రథమ శ్రేణి కవితకు రూ. 3,116, నగదు బహుమతి ,
- ద్వితీయ శ్రేణి ఉత్తమ కవితకు రూ. 2,116 నగదు బహుమతి,
- తృతీయ శ్రేణి కవితకు రూ.1,116 నగదు బహుమతి, అందజేయనున్నట్లు తెలిపారు.
- అంతేకాక వీరికి నగదు బహుమతితో పాటు , బిరుదు ప్రదానం, ప్రశంసా పురస్కారం, జ్జాపికతో సత్కరించనున్నట్లు చెప్పారు.
- మరో 10 ఉత్తమ కవనాలకు సమ్మోహన కవితగా పరిగణిస్తూ ప్రోత్సాహ కవితలకు కవన కిరణం బిరుదు ప్రదానంతో పాటు రూ. 516 నగదు బహుమతి అందజేయనున్నారు.
- 116 ఉత్తమ కవితలకు : కవి శ్రేష్ట బిరుదు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కవితలను ఫిబ్రవరి 20వ తేది లోపుగా పోటీ కవితలను వాట్సప్ ద్వారా ఎంట్రీలు పంపాలని మోటూరి నారాయణరావు కోరారు.