నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి.సురేందర్, రాధాకృష్ణ, రాజు, వెంకటేష్, అనిల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.