వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేస్తున్నారా..? పోలీసుల‌కు ఇలా స‌మాచార‌మివ్వండి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని న‌వ‌రాత్రోత్స‌వాలు జ‌రిపేందుకు మీరు వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేస్తున్నారా..? మీరు నిర్వ‌హించే ఉత్స‌వ వివ‌రాలు, నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌పై పోలీసు విభాగం అధికారుల‌కు స‌మాచారం ఈ విధంగా ఇవ్వడం ద్వారా త‌ద‌నుగుణంగా ప్ర‌భుత్వ అధికారులు ఏర్పాట్లు చేయ‌నున్నారు. గ‌త రెండు సంవ‌త్సరాలుగా కోవిడ్ కార‌ణంగా సామూహిక న‌వ‌రాత్రోత్స‌వాలు త‌క్కువ శాతంలో నిర్వ‌హించారు. ఈ సంవ‌త్స‌రం వినాయ‌క మండ‌పాలు పెద్ద‌మొత్తంలో ఏర్పాట‌య్యే అవ‌కాశం ఉన్న కార‌ణంగా నిర్వాహ‌కులు ఏర్పాట్ల వివ‌రాల‌ను అందించాల‌ని పోలీసు విభాగం అధికారులు సూచిస్తున్నారు. http://policeportal.tspolice.gov.in/index1.htm వెబ్‌సైటులో మండప నిర్వ‌హ‌ణ‌పై స‌మాచారం ఇచ్చే వ్య‌క్తి వివ‌రాలు, మండప వివ‌రాలు, నిమ‌జ్జనం నిర్వ‌హించే తేదీ,స‌మ‌యం, విద్యుత్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని సూచించారు. ఈ వివ‌రాల ఆధారాంగా వివిధ విభాగాల ప్ర‌భుత్వ అధికారులు నిమ‌జ్జ‌నాల ఏర్పాట్లు చేయ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతం వారైనా మండ‌ప నిర్వాహ‌కులు త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌చారం అందించాల‌ని పోలీసులు సూచించారు. వివ‌రాలు న‌మోదు చేసేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి 

వినాయ‌క మండ‌పాలు నిర్వ‌హించే వారికి ఈ విలువైన స‌మాచారాన్ని షేర్ చేయండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here