నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కి చెందిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు జగదీష్ పటేల్ జై గణేశ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ గా నియామకమయ్యారు. జెజీబీఎస్ టీ ఫౌండర్, అధ్యక్షుడు జైన్ కుమార్ చారి, రాష్ట్ర చైర్మన్ ఆలూరి ఈశ్వర్ ప్రసాద్ జగదీష్ ను నియమిస్తూ నియామకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ పటేల్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుతూ సాంస్కృతిక సంప్రదాయాలను రక్షించడం మన బాద్యత అన్నారు. అలాగే 1001 సార్లు జై గణేశ నామాలను రాయాలని కోరుకుంటూ భక్తి భావాన్ని పెంపొందించడానికి ఈ నామాలు రాయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి దేవి, కమ్మరి మహేష్ , సహాయ కార్యదర్శి రాజ్ కుమార్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్రాంతి వాలే శెట్టి ఉన్నారు.