ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

పాల్గొన్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్, నానక్ రామ్ గూడా గ్రామంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తై 78 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం మన జెండా నినాదంతో ప్రతి ఇంటిపై మన దేశ గౌరవం, మన జెండా ఎగరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించారని అన్నారు.

మన దేశంలోని ప్రతి పౌరుడు మన జాతీయ జెండాను మొబైల్ వాట్స్ ఆప్ స్టేటస్ లలో, ఫేస్బుక్ , ఇన్స్టాగ్రాం ,ఎక్స్ , సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో జాతీయ జెండాను ప్రమోట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసంత్ యాదవ్, హనుమంత్ నాయక్, మీన్ లాల్, వరలక్ష్మి, శివాసింగ్, వినితా సింగ్, గోపాల్, కిషన్ , రంజిత్, సీతా, కవితా భాయి, సంకేశ్, బబ్లూ, నరసింహ, ప్రకాష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here