- 45 మందికి రూ. 18 లక్షల 42 వేలు మంజూరు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. 45 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి నిధులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు మంజూరైన రూ. 18 లక్షల 42 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందచేశారు.
అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నరేందర్ ప్రసాద్, దేవేందర్ రెడ్డి, బాల్ నర్సయ్య, మోహన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.