నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన లక్ష వస్త్రధారణ అలంకరణ పూజకు ముఖ్యఅతిథిగా హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, నమస్తే లింగంపల్లి పత్రిక సంపాదకుడు పుట్టా వినయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ప్రత్యేక పూజలు చేసి సకల విఘ్నాలను తొలగించి ఉన్నత బాటలో పయనించేలా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి, రెహనా బేగం, రాజేష్, గాజుల మహేష్, నాగరాజ , జనార్ధన్, కుటుంబరావు, కళ్యాణ్ గౌడ్, శ్రీనివాస్, అరుణ, మౌలిక, శ్వేతా, సరిత పాల్గొన్నారు.