నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ ఎలక్షన్ లో డైనమిక్ ప్యానెల్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ప్రెసిడెంట్ గా రవీంద్ర రాథోడ్, జనరల్ సెక్రెటరీ గా మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రామ భూపాల్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రెహనా బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీ వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆరంభ టౌన్షిప్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ వాసులు రాజశేఖర్, రవీంద్ర, గణేష్ కుమార్ పాల్గొన్నారు.