- మంత్రి హరీశ్ రావు తో కలిసి 500 మంది లబ్ధిదారులకు ఇండ్లపత్రాలు అందజేసిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ లబ్ధిదారులకు 500ల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పత్రాలు అందజేశారు.
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఇళ్ల పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి అర్హులైన 500 మంది లబ్దిదారులకు ఇండ్ల పత్రాలను అందించడం సంతోషకరమైన విషయమన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , ప్రసాద్, ఎండీ ఇబ్రహీం పాల్గొన్నారు.