నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్, మియాపూర్ డివిజన్లలో శివాజీ యూత్ అసోసియేషన్, ప్రకాష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాల వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్కె ప్రసాద్, శ్రీధర్, రవి గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, జగన్ గౌడ్, జితేందర్, ఆళ్ళ వరప్రసాద్, హేమంత్ విశాల్ సింగ్, కృష్ణం రాజు, సత్యనారాయణ, సాంబయ్య, గిరి, పృథ్వి, మని, గణేష్ అశోక్, శ్రీనివాస్, చంద్ర, రాజకుమార్, పవన్, ఉపేంద్ర, రవి, విశ్వజిత్, అనిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.