నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని ఇందిరానగర్, చిన్న అంజయ్యనగర్ లో డ్రైనేజీ, సీసీ రోడ్డును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేసి పరిశీలించారు.
త్వరితగతిన డ్రైనేజీ పనులు ప్రారంభించి పూర్తి చేసి వెంటనే సీసీ రోడ్డు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపట్టే సమయంలో రోడ్డుకు సరిపడా క్యూరింగ్ చేయించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికవాసులు పలు సమస్యలపై కార్పొరేటర్ కి విన్నపించగా వారు సానుకూలంగా స్పందించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జవాబుదారీగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ నయీమ్, యూసుఫ్ పాషా, షౌకత్, సద్దాం, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, అబ్దుల్ సత్తర్, ముకేశ్, ముక్సిద్, రాజన్, ఆశిష్, పంతోల్, ప్రవీణ్, చారీ, అరుణ్, వేణు పాల్గొన్నారు.