- నల్లగండ్ల ఎస్సీ బస్తిలో పర్యటించిన రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గడపగడపకు బిజెపి కార్యక్రమం చేపట్టారు. గడపగడపకు తిరుగుతూ బిజెపి పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగిరే లా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నల్లగండ్ల ఎస్సీ బస్తీలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి రాధాకృష్ణ, ఎల్లేష్, విష్ణువర్ధన్ రెడ్డి, వసంత్ యాదవ్ పాల్గొన్నారు.