యువకులు, మహిళలకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

  • లైట్ హౌస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
  • ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
  • హఫీజ్ పెట్ డివిజన్ లో 25 రోజుల పాటు కొనసాగింపు
లైట్ హౌస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, చిత్రంలో డిప్యూటీ మేయర్ మోతె శోభన్ శ్రీలత, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో లైట్ హౌస్ సంస్థ సౌజన్యంతో హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ వద్ద స్కిల్ డెవలప్ మెంట్ కార్యాలయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ శ్రీలత ప్రారంభించారు. వీరితోపాటు కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ , మంజుల రఘునాథ్ రెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. జి.హెచ్.ఎం.సి పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోనే మొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పాల్గొన్న యువతి, యువకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఒక్కరూ అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నదని అన్నారు. చదువు ఉన్న, లేకున్నా ప్రతి సంవత్సరం 600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 18 నుంచి 35 సంవత్సరంలోపు ఉన్న యువకులు, మహిళలకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్యం లైట్ హౌస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, హఫీజ్ పెట్ డివిజన్ నందు 25 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారని, ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో లైట్ హౌస్ సంస్థ నిర్వాహకులు సి.ఈ.ఓ రుచి, ఇంచార్జి శ్రావణి, జి.హెచ్.ఎం.సి జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, జోనల్ కమీషనర్ శంకరయ్య , డిప్యూటీ కమీషనర్ వెంకన్న, హెల్త్ ఆఫీసర్ కార్తిక్, చందనగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషరాణి, ఈ.ఈ శ్రీకాంతి, డి.ఈ స్రవంతి, ఎస్.ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here