గోకుల్ ప్లాట్స్ కాలనీని నిలబెట్టింది భిక్షపతి యాదవ్

  • గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర 66 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో నరేంద్ర మోడీ 9 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ, బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరిస్తూ ఇంటి ఇంటికీ కరపత్రాలను పంచుతూ బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. ఈ 9 ఏళ్లలో ఎమ్మెల్యే ఈ నియోజవర్గానికి ఎంతో చేయొచ్చు కానీ చేసింది అరకొర పనులే , గోకుల్ ప్లాట్స్ ను ఇక్కడ నుండి ఖాళీ చేయిస్తుంటే అడ్డుకుని ప్రభుత్వంతో కొట్లాడి కాలనీనీ కాపాడింది భిక్షపతి యాదవ్ అని గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం పి.ఎం స్వనిధి,భేటి బచావో – భేటీ పడావో , సుకన్య సమృద్ది యోజన , ముద్రా యోజన , ఈ శ్రమ్ , ఆయుష్మాన్ భారత్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇవే కాకుండా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు, భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించండి అని కోరారు. ఏ సమయమైనా.. ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, మదనా చారి, మధు యాదవ్, గోవర్ధన్ రెడ్డి, యాదయ్య, నాగరాజు, సాయి , మని, అజయ్ , ఎల్లేష్, పద్మ, పార్వతి, నాగులు, శ్రీనివాస్, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here