ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

  • టీ-డయాగ్నొస్టిక్స్‌ హబ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు
  • ఇకనుంచి ప్రభుత్వ దవాఖణాల్లో 134 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్‌ ప్రభుత్వ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ నుంచి వర్చువల్‌గా టీ-డయాగ్నొస్టిక్స్‌ హబ్ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. అనంతరం నవజాత శిశు జనన నూతన వార్డును కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ నందు ఎమ్మెల్యే గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం టీ-డయాగ్నొస్టిక్స్‌ శాంపిల్ రవాణా వాహనాన్ని ఎమ్మెల్యే గాంధీతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో గతంలో 54 పరీక్షలు చేస్తే ఇప్పుడు అన్ని రకాల వైద్య సేవలతో బాటుగా 134 పరీక్షలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో తక్కువ స్థాయిలో ఉండే ప్రసవాలు ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఇప్పుడు 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లే అవసరం లేకుండ ఆధునాతన పరీక్ష పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా టీ-డయాగ్నొస్టిక్స్‌ హబ్ లాంటి పరీక్ష కార్యక్రమం లేదని తెలిపారు.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, ప్రజలను మహమ్మారిబారినుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషిచేసిన డాక్టర్లందరికీ వరల్డ్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ షేక్ హమీద్ పటేల్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, ఊట్ల కృష్ణ, కొండాపూర్ ప్రభుత్వ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ సూపెర్నినెంట్ వరదచారీ, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఊట్ల దశరథ్, జంగంగౌడ్, షేక్ చాంద్ పాషా, రూపరెడ్డి, గౌరీ, నిర్మల, నరసింహ సాగర్, రాజు యాదవ్, శ్రీనివాస్ చౌదరి, గువ్వల రమేష్, మల్లెల శ్రవణ్ యాదవ్, బుడుగు తిరుపతి రెడ్డి, సిద్ధిక్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు, రవీ శంకర్ నాయక్, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, తిరుపతి యాదవ్, సాయి శామ్యూల్ కుమార్, న్యూ పీజెఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, నరేష్ ముదిరాజ్, గణపతి, అశోక్ సాగర్, రమేష్, డా రమేష్, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, ఎర్ర రాజు, శ్యామల, గిరి గౌడ్, మధు ముదిరాజ్, సయ్యద్ ఉస్మాన్, హిమామ్, అబేద్ అలీ, ఏండీ జహీర్ ఉద్దీన్, జుబెర్, వసీమ్, సాయి బాబు సాగర్, ఏండి ఖాసీం, సంజీవ, ఈరన్న, వీరేష్, ప్రభాకర్, రెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here