- 95 వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర
- అమలు కానీ హామీలలిచ్చి ప్రజలను మభ్య పెడుతున్నరు
- అప్రమత్తంగా ఆలోచించి ఓటెయ్యాలి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ తారా నగర్ ఓల్డ్ విలేజ్, సాయి మారుతి కాలనీ, ఇంద్రనగర్ కాలనీలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ అవతారెడ్డి కాంటెస్టెడ్ కార్పొరేట్ సింధు రెడ్డి డివిజన్ అధ్యక్షులు రామ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి సంక్షేమ రాజ్యం, సుపరిపాలన కోరుకునే పార్టీని ఎన్నుకోవాలని, అది బిజెపితోనే సాధ్యమైతుందని తెలుపుతూ.. పక్కా నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేసి అభివృద్ధికి పాటుపడతామని తెలుపుతూ నియంతృత్వ, నిరంకుష, కుటుంబ పాలన కొనసాగించే పార్టీలకు స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ ,మల్లేష్ గౌడ్, గౌస్, చందర్ యాదవ్, రమేష్, నరసింహ, సైదమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.