- ముఖ్యఅతిథులుగా పాల్గొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బీ.జే రావు, డాక్టర్ జి. శశికాంత్, డాక్టర్ నిగమ్ రిజిస్ట్రార్
నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కమ్యూనిటీ హాలు లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బీ.జే రావు, డాక్టర్ జి. శశికాంత్ (ప్రముఖ ఆర్థో వైద్యులు, స్టార్ హాస్పిటల్స్, నానక్ రాంగూడ) , డాక్టర్ నిగమ్ రిజిస్ట్రార్ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హెచ్సీయూ చీఫ్ మెడికల్ అధికారి, హైదరాబాద్ డాక్టర్స్ ఫోరమ్ కన్వీనర్ కెప్టెన్ రవీంద్ర కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బీ.సీ రాయ్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు.
తదనంతరం అతిథులు శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేటు వైద్యశాలలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 30 మంది వైద్యులను డాక్టర్ బీ.సీ రాయ్ పురస్కారంతో (శాలువ, పుష్పగుచ్ఛం, పగడి, జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ శంకరనారాయణ రచించిన ‘డాక్టర్ శతకం’ గ్రంధాన్ని వైస్ ఛాన్స్ లర్ బీజే రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ సౌజన్యంతో నిర్వహించారు. తదనంతరం ఉపకులపతి ఆచార్య బీజే రావు మాట్లాడుతూ సమాజంలో అధ్యాపక వృత్తి తరువాత కుల, మత, ప్రాంతాలకు అతీతంగా గౌరవించే వృత్తి వైద్య వృత్తి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్ హమీద్ పటేల్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు త్రివేణి, వాణి సాంబశివరావు, ధర్మసాగర్, జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, విష్ణు ప్రసాద్, కుమారి , దివ్య , వరలక్ష్మి , వీణ , సుజాత, హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.