- శ్రీకృష్ణదేవరాయలు చరిత్రను తెలుసుకోవాలి : బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్
- యద్దన పూడి వెంకటరత్నం రచించిన శ్రీకృష్ణదేవరాయ చరిత్ర పుస్తకాన్ని భేరి రామచందర్ యాదవ్ కి బహుపదించిన గ్రంథ ప్రచరణకర్త ఆల బాలయ్య
నమస్తే శేరిలింగంపల్లి : శ్రీకృష్ణదేవరాయలు యాదవ వంశస్తుల గొప్ప చక్రవర్తి, మంచి పరిపాలన అందించిన రాజని బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ కొనియాడారు. గ్రంథ ప్రచరణకర్త ఆల బాలయ్య అందించిన శ్రీకృష్ణదేవరాయ చరిత్ర పుస్తకాన్ని తీసుకుని ప్రసంగించారు. “యాదవ కులోద్భవ, యాదవ కులాంబరధ్యుమణి శ్రీకృష్ణదేవరాయలు పరిశోధన గ్రంథం యద్దన పూడి వెంకటరత్నం కలం నుంచి జాలువారగా.. దీనిని ఆల బాలయ్య ప్రచురించారు. భేరి రాంచందర్ యాదవ్ కి గ్రంథాన్ని అందించిన అనంతరం ఆల బాలయ్య మాట్లాడుతూ.. రచయిత యద్దనపూడి వెంకటరత్నం శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులస్తుడని సమర్థించడానికి ఎన్నో ఆకారాలు చూపించారని, మరెన్నో శాసనాలు శోధించారని, అనేక గ్రంథాలు పరిశీలించారని, అనేక వ్యాసాలను అవగాహన చేసుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీకృష్ణదేవరాయలు యాదవ వంశస్తుడని చంద్రవంశ క్షత్రియుడని, యాదవ రాజని, వాళ్లు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు. ఆనాటి కవులు కూడా వారి రచనల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని కులాలు శ్రీకృష్ణదేవరాయలు వారి కులస్తుడని చెప్పుకోవడం ఖండించదగినదని అన్నారు. యద్దనపూడి వెంకటరత్నం శ్రీకృష్ణదేవరాయల కులాన్ని గురించిన వాస్తవ చరిత్రను లోకానికి అందించాలనే, దృఢ సంకల్పంతో ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహా చక్రవర్తిని కేవలం కులకోణంలో చూడకూడదని, ఆ మహా పురుషుడు అందరివాడిగానే గౌరవించబడాలని అన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు కచ్చితంగా యాదవ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు చరిత్రను తెలుసుకోవాలని అది మన వారసత్వమని, యాదవ కులోద్భవ, యాదవ కులాంబరధ్యుమణి శ్రీకృష్ణదేవరాయలు పరిశోధనా గ్రంధాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి డప్పు కొట్టు హరిబాబు యాదవ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్, సురేష్ యాదవ్, గోపి యాదవ్, బిల్డర్ శివా యాదవ్ నర్సింహా యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.