నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద జరుగుతున్న చెరువు కట్ట మరమ్మతు పనులను, గండి పూడ్చే పనులను, అలుగు స్థితిగతులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పటేల్ చెరువు కట్టకు గండి పడిన విషయం విదితమేనని, గండి పూడ్చి, కట్ట యథాస్థితికి తీసుకువచ్చామని, కట్ట మరమ్మత్తుల పనులు వేగవంతం చేయాలని, కట్టను పతిష్టపర్చాలని, మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, హరి పాల్గొన్నారు.