సురభి కాలనీలో ఉచిత వైద్య శిబిరం

  • పెద్ద ఎత్తున పాల్గొని పరీక్షలు చేయించుకున్న ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీ ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో విశ్వకర్మ ఫౌండేషన్ – శేరిలింగంపల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి 320డి, ఎం.ఎన్.జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లు వివరించారు. ప్రజలందరూ వివిధ రకాలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, గుండె, సంబంధిత పరీక్షలు, అన్ని రకాల వైద్య సేవలు అందజేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ప్రతి ఏడాది ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్యపరంగా ఉండేలా చూ’స్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ స్కూల్ చైర్మన్ బస్వరాజ్ లింగాయత్, విశ్వకర్మ ఫౌండేషన్ శేరిలింగంపల్లి అధ్యక్షురాలు రమాదేవి, క్లబ్ కోఆర్డినేటర్ సుజాత, వార్డ్ మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శశికళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, స్వరూప, రమాదేవి, కుమారి, రోజరాణి, శ్రీధర్ పగడోజు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గాయత్రి విశ్వకర్మ దేవస్థానం పాపిరెడ్డి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్వకర్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సురభి కాలనీ ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను సన్మానిస్తున్న దృశ్యం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here