క్షేమంగా.. క్షణాల్లో వెళ్ళిపోదాం…

  • గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీకి చెక్
  • రూ. 466 కోట్ల అంచనా వ్యయంతో 4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణం
  • ORR నుంచి శిల్ప లేఔట్ (మైండ్ స్పేస్ )వరకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
  • ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేేేేేటీఆర్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ORR నుంచి శిల్ప లేఔట్ (మైండ్ స్పేస్ )వరకు రూ. 466 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ను ఐటీ శాఖామంత్రి , తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఛైర్మన్లు గ్యాదరి బాలమల్లు, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, నగేష్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు, జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్నతో కలిసి ప్రారంభించారు.

4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఎస్‌ఆర్‌డీపీలో భాగంగాఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిల్పా లే-ఔట్‌ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శిల్పా లే-ఔట్‌ ఫ్లై ఓవర్ నిర్మాణం వాళ్ళ ఔటర్ రోడ్డుకు వెళ్ళడానికి సులభతరం అవుతుందన్నారు. అదేవిధంగా IT హబ్ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి IT ప్రాంతాలు, రద్దీ ఉండే చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని హంగులతో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మానానికి చర్యలు చేపట్టి పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి ప్రాజెక్ట్ (SRDP )పై ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టి, మంత్రి KTR ప్రణాళికలు ఫలించాయని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ట్రాఫిక్ సమస్యల పై ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు.

4లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

SRDP ప్రాజెక్ట్ లో భాగంగా అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం తొలి ఫలితమని అన్నారు. 50 యేండ్ల చరిత్రలో ప్రత్యామ్నాయ రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు ఎన్నడూ జరగలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాయంలో ఇంతటి అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తమకు గర్వంగా, గౌరవంగా ఉందని అన్నారు. దుర్గం చెరువు వద్ద నిర్మించిన రోప్ వే లేదా కేబుల్ బ్రిడ్జితో ప్రర్యాటక ప్రాంతంగా పర్యాటక ప్రాంతంగా వెలసిల్లిందని సంబరపడ్డారు. జాతీయ రహదారి (ఎన్ హెచ్- 65) గంగారాం హనుమాన్ దేవాలయం నుంచి అపర్ణ అపార్ట్ మెంట్స్ వరకు లింక్ రోడ్డును చేపట్టాలని, ఉషాముళ్ళపూడి కమాన్ నుంచి గాజుల రామారం వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని, జెఎన్ టియు నుండి వయా (హెచ్ ఎం టి హిల్స్) ప్రగతి నగర్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ త్వరలోనే పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు CE దేవానంద్, ప్రాజెక్ట్స్ SE వెంకట రమణ , EE నామ్య, DE హరీష్, AE శివకృష్ణ , జిహెచ్ఎంసీ అధికారులు SE శంకర్ నాయక్, EE శ్రీనివాస్, DE రమేష్, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, తెరాస పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు, కాలనీ వాసులు , కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ORR నుంచి శిల్ప లేఔట్ (మైండ్ స్పేస్ )వరకు ఉన్న ఫ్లై ఓవర్ ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here