పనుల్లో జాప్యం వహించకుండా వెంటనే పూర్తి చేయండి

  • అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి రాయదుర్గం ముస్లిం బస్తీలో రూ. 25 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం ముస్లిం బస్తీలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డును జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు , సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి  చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు EE శ్రీనివాస్, DE విశాలాక్షి, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, తెరాస నాయకులు దారుగుపల్లి నరేష్, రమేష్, జగదీష్, సల్లావుద్దీన్, అక్బర్ బాయ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

రాయదుర్గం ముస్లిం బస్తీలో జిహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here