- దళిత బహుజన పార్టీ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దళిత జాతిని విభజించడానికి కుట్రలకు పాల్పడి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తున్న మనువాద దోపిడీ పార్టీలను సమాధి చేయాలని దళిత బహుజన పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ. కాంగ్రెస్ పార్టీ లను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం గా సమాధి చేయకపోతే బానిసత్వం తప్పదన్నారు. ఆ పార్టీ సెంట్రల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాస్, ఎన్నికల కమిటీ సభ్యులు మాట్లాడారు.
ఉత్తర భారత దేశంలో..దళితుల విభజన రాజకీయాలకు ఈ మనువాద పార్టీ లు పాల్పడినందుకే.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్టాలలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని.. బీజేపీ పార్టీని పంజాబ్, ఢిల్లీ. తదితర రాష్ర్టాలలో దళిత జాతి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో ఓట్లు రాబట్టడానికి దళితులను చీల్చి సామాజికoగా, రాజకీయంగా అణిచివేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పటేళ్ల కుల దురహంకారులు చూస్తున్నారని తెలిపారు. ఇక్కడ దళిత జాతిని అణిచివేసి బానిసలుగా చేసుకోవడానికి చూస్తున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో మోడీ. అమితాషా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సిద్ధంగా ఉన్నారని కృష్ణ స్వరూప్ ఆరోపించారు. మనువాదులు సృష్టించి పెంచి పోషించిన కొంతమంది రాజకీయ బ్రోకర్ లు, బానిస కుక్కలు రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ అంబేద్కర్ స్పృహను దెబ్బ కొట్టడానికి పూనుకుంటున్నారని తెలిపారు. దళిత జాతి ఎన్నికలతో, పొలిటికల్ పవర్ సాధనతోనే సోషల్ జస్టిస్, రక్షణ, విముక్తి వస్తుందన్నారు. మనువాదుల విభజన రాజకీయాలకు బలైతే.. భవిష్యత్తు ఉండదని, పూర్వపు బానిసత్వం తప్పదని ఆవేదన వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు బొడుసు మహేష్ యాదవ్, పి. సాంబయ్య వడ్డెర, గంధం శంకర్ నేతకాని పాల్గొన్నారు.