నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. బంగారు తెలంగాణలో బాగస్వాలయ్యేందుకు తాము సైతం అంటూ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ తెలిపారు.
చందానగర్ డివిజన్ లోని శివాజీనగర్ కాలనీ వాసులు, బిజెపి, కాంగ్రెస్, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆర్ఎస్ఎస్ యూత్ వింగ్ యువజన నాయకులు చందానగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఉరిటి వెంకట్రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో యువత చేరారు. ఈ సందర్భంగా వారిని బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సుప్రజ, ప్రవీణ్, రవీందర్ రెడ్డి, వివిఆర్ యువ సేన సభ్యులు పాల్గొన్నారు.