సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ. 8,51,000లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పొందినవారు: 

 • 1. అరుణ కుమారి , షంషీగూడ , కూకట్ పల్లి , రూ. 48,000 వేలు.
 • 2. సావిత్రి , దీనబంధు కాలనీ , కూకట్ పల్లి, రూ. 40,000 వేలు
 • 3. సుందర హారిక , ప్రగతి ఎనక్లేవ్ , మియాపూర్ , రూ. 1,00,000
 • 4. లక్ష్మి , ఇంద్ర హిల్స్ , కూకట్ పల్లి రూ. 60,000
 • 5. లక్ష్మి , వడ్డెర బస్తి , గచ్చిబౌలి రూ. 15,000
 • 6. శ్రీను , రామ్ నరేష్ నగర్ , హైదర్ నగర్ , రూ. 60,000
 • 7. ఖాజా ముషీరుద్దీన్, అన్నపూర్ణ ఎనక్లేవ్, చందానగర్, రూ. 20,000
 • 8. లక్ష్మి భాయ్ , శాంతి నగర్ , శేరిలింగంపల్లి , రూ. 16,000
 • 9. మహమ్మద్ నసీర్ , ఆదిత్య నగర్, శేరిలింగంపల్లి , రూ. 60,000
 • 10. రమేష్ , పాపిరెడ్డి నగర్ , రూ. 60,000
 • 11. పెద్ద పుల్లయ్య , పాపిరెడ్డి నగర్ , కూకట్ పల్లి, రూ. 12,000 /-
 • 12. రామచంద్ర శేఖర్ రావు , దీప్తి శ్రీ నగర్ రూ. 60,000
 • 13. లీల , పాపిరెడ్డి కాలనీ , శేరిలింగంపల్లి, రూ. 60,000
 • 14. సబియా బేగం , ప్రేమ్ నగర్ , శేరిలింగంపల్లి , రూ. 60,000
 • 15. సాయి బాబు , ప్రజయ్ సిటీ , రూ. 60,000
 • 16. సమీరా బేగం , మార్తాండ నగర్ , న్యూ హాఫీజ్పేట్ , రూ. 60,000
 • 17. షాహిన్ సుల్తానా , రూ. 60,000 సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పొందారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా.. ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, శ్రేయభిలాషులు, అభిమానులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, మహిళ సోదరీమణులు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here