వ‌ర‌క‌ట్న వేధింపుల‌తో వివాహిత ఆత్మ‌హ‌త్య‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భ‌ర్త, ఆడ‌ప‌డుచుల వ‌ర‌క‌ట్న వేధింపుల కార‌ణంగా ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… మియాపూర్ ఎస్ఎమ్ఆర్ మెట్రో పోలీస్‌లో నివాస‌ముండే పావ‌ని(22) శ‌నివారం సాయంత్రం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. పావ‌నికి కొంత‌కాలం క్రితం ఆదిలాబాద్‌కు చెందిన శ్ర‌వ‌ణ్ తో వివాహం జ‌రిగింది. శ్ర‌వ‌ణ్ ప్ర‌స్తుతం ఉద్యోగాన్వేష‌న‌లో ఉన్నాడు. వివాహం అనంత‌రం పావ‌ని భ‌ర్త శ్ర‌వ‌ణ్‌, ఆడ‌ప‌డుచు శ‌కుంత‌ల‌, హిమవంత్ రెడ్డిల‌తో క‌లిసి వ‌ర‌క‌ట్నం కోసం వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లు పావ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. మియాపూర్ ఎసిపి సంఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పావ‌ని
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here