నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ కావూరి హిల్స్ లోని ఒక ఇంటిలో ఏసీ రిపేరు కోసం వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునగల గ్రామానికి చెందిన యాదగిరి (22) ప్రస్తుతం రహమత్ నగర్ యూసుఫ్ గూడ లో నివాసం ఉంటున్నారు. యాదగిరి అనే యువకుడు ఏసీ రిపేర్ నిమిత్తం కావూరి హిల్స్ లోని ఒక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో కరెంట్ షాక్ కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
