- మూడో విడతలో 1819 మంది లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు పంపిణీ
- శేరిలింగంపల్లి నియోజక వర్గంలో మొత్తం ఇప్పటివరకు 2819 ఇండ్లు అందజేత
- దివ్యాంగులు 70 ఎస్సీ 479 ఎస్టి 169 ఇతరులు 2101
నమస్తే శేరిలింగంపల్లి: సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ సముదాయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ మూడవ విడత డ్రా ఘనంగా జరిగింది. 1819 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డి ఆర్డీఓ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ఇళ్ల పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులు మాట్లాడుతూ ఇది తమకు నిజమైన పండుగ రోజని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, తమ లాంటి పేదలకు దైవంతో సమానమన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి స్వంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న నేత అని, సిఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ఎంతో పారదర్శకంగా ఎంపికైన 2819 మంది లబ్దిదారులకు ఇండ్ల పత్రాలను అందించామనారు. ఇండ్లు పొందిన లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండ్లు రాని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని , దశల వారిగా ఇండ్ల ను అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.