శేరిలింగంపల్లి మండల రెవెన్యులో భారీ మార్పులు… ఒకేసారి ఆరుగురు అధికారుల బదిలీ…

  • డిప్యూటీ కలెక్టర్ మొదలు.. జూనియర్ అసిస్టెంట్ వరకు అందరు కొత్తవారే…
  • కొంతకాలం వరకు ప్రజలకు తప్పని తిప్పలు

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు శేరిలింగంపల్లి మండల రెవెన్యూలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మండలం నుంచి ఒకేసారి ఆరుగురు అధికారులు బదిలీ అయ్యారు. ఇక్కడ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ మేడ్చల్ కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. అదేవిధంగా రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు కే.శీనయ్య గండిపేట్ మండల సీనియర్ అసిస్టెంట్ గా, ఆకారపు శ్రీకాంత్ మొయినాబాద్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు. వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్లు నరేందర్ రెడ్డి మహేశ్వరం మండలానికి, రామకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి, శ్రీలత హయత్ నగర్ మండలానికి బదిలీ అయ్యారు.

కాగా రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు శీనయ్య స్థానంలో కందుకూరు మండలం నుంచి ఏ.శ్రీను, శ్రీకాంత్ స్థానంలో జీ.చంద్రమోహన్ మొయినాబాద్ మండలం నుంచి బదిలీపై రానున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ నరెందర్ రెడ్డి స్థానంలో నరేష్ మహేశ్వరం మండలం నుంచి బదిలీపై రానున్నారు. ఇదిలా ఉండగా సూపరెంటెండెంట్ శంకర్ స్థానంలో ఎవరిని పంపడం అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయించాల్సి ఉంది. ఐతే శేరిలింగంపల్లి మండల రెవెన్యూలో ఒకేసారి ఆరుగురు అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశం.

ఇక్కడ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ గా విధులు నిర్వహించిన వంశీ మోహన్ స్థానంలో ఇటీవలే శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరించడం, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి స్థానంలో ఫ్రాంక్లిన్ కొద్ది రోజుల క్రితమే చార్జ్ తీసుకోని ఇప్పుడిప్పుడే మండలం గురించి కొద్దికొద్దిగా అవగాహన పొందుతున్నారు. ఈ సమయంలో ఒకేసారి ఆరుగురు ఈ కార్యాలయం నుంచి బదిలీ అవ్వడం ఆందోళన కలిగించే అంశం. కొత్తగా వచ్చిన అధికారులందరూ వారి స్థానాల్లో స్థిరపడేంతవరకు శేరిలింగంపల్లి ప్రజలకు మాత్రం తిప్పలు తప్పేలా లేవు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here