అన్నమయ్యపురంలో ఆకట్టుకున్న సంకీర్తనా శ్రవణం

నమస్తే శేరిలింగంపల్లి: పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చనలో కూమారి సిరి స్పందన “గజవదనా బెడువే”, “అందరికీ అభయంబులు ఇచ్చు చేయి”, “నారాయణతే నమో నమో”, “ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన”, “గోవిందా గోవిందా అని కొలువరే”, “జో అచ్యుతానంద జోజో ముకుందా”, “భావయామి గోపాలబాలం”, “అలరులు కురియగా”, “తిరువీధులు మెరసి”, “చక్కని తల్లికి చాంగుబళ”, వంటి బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలను ఆలపించారు.

వీరికి కీబోర్డ్ పై శాస్త్రి తబలపై అజయ్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానంతరం డాక్టర్ శోభా రాజు సిరి స్పందనను సంస్థ ఙ్ఞాపికనిచ్చి సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here