- సాయి దీపా హాస్పిటల్ – న్యూరో & మల్టిస్పెషలిటీ లో ఆర్థిక, వైద్య అక్రమాలపై ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలోని గంగారాం గ్రామంలోని సాయి దీపా హాస్పిటల్ – న్యూరో & మల్టిస్పెషలిటీ లో జరుగుతున్న ఆర్థిక, వైద్య అక్రమాలపై రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలిసి టీపీసీసీ సమన్వయకర్త శామ్యూల్ కార్తీక్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా శామ్యూల్ కార్తీక్ మాట్లాడుతూ వైద్యం ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇలాంటి సందర్భంలో వైద్యం పేరిటా అక్రమాలకు పాల్పడే వారిని సహించమని తెలిపారు. ఈ భేటీలో యువజన, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.