నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ ప్యాక్‌ల(రంజాన్ తోఫా)ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ తో కలిసి రాజీవ్ గృహకల్పలోని మసీద్ ఏ బిలాల్ వద్ద పేద ముస్లిం కుటుంబాలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా అన్ని పండగలకు బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ముస్లింలకు బట్టలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్, ఆర్జీకే వార్డు మెంబర్ శ్రీకళ, మసీదు సదర్ బురాన్, నాయకులు సత్తార్, గౌస్, అలీం, బాషా, లక్ష్మణ్ యాదవ్, పటోళ్ల నర్సింహా, గోపాల్ యాదవ్, పవన్, జమ్మయ్య, సాయి, కౌసల్య, సౌజన్య, భాగ్యలక్ష్మి, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.