నమస్తే శేరిలింగంపల్లి: మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. గచ్చిబౌలిలో టెలీకాం నగర్ బస్టాండ్ ఎదురుగా సత్య సాయి సేవా సమితి గచ్చిబౌలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామస్వామి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రతి సంవత్సరం సత్య సాయి సేవా సమితి వారు పాదాచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చటానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సామాజిక సేవలో భాగంగా సత్యసాయి సేవా సమితి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు బాసటగా నిలుస్తుందన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ సహాయంతో ఈ చలివేంద్రాన్ని మూడు నెలలునిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి సభ్యులు డా రామన్న, డా. కృష్ణకుమారి, బివికె రావు, దయాసాగర్, దీప్తి, ఉషారాణి, రాహుల్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.