హనుమాన్ యూత్ గణేశుని లడ్డు రూ.3.47 లక్షలకు కైవసం చేసుకున్న నిమ్మల జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి:హఫీజ్ పేట్ లోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజున వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలందుకున్న వినాయక లడ్డు వేలం పాటలో నిమ్మల అనంతరాం గౌడ్ కుమారుడు నిమ్మల జగదీశ్వర్ గౌడ్ రూ. 3.47 లక్షలకు మహా లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయ‌కుడి ల‌డ్డు ఎంతో మ‌హిమ గ‌ల‌ద‌ని, ఈ క్ర‌మంలోనే గ‌త కొన్నేళ్లుగా తోచిన స్థాయిలో ప‌విత్ర‌మైన ల‌డ్డూల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నామని అన్నారు. ఈ వేలం పాట‌ల వ‌ల్ల ల‌డ్డు పొందిన వారికి పుణ్యం ద‌క్క‌డంతో పాటు మండ‌పాల నిర్వాహ‌ణ‌కు ఎంతో స‌హ‌కారం అందించిన వార‌మ‌వుతామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బౌలింగ్ యాదగిరి గౌడ్, రమేష్ గౌడ్, తలారి కృష్ణ ముదిరాజ్, రాజిరెడ్డి, బోయిని వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బౌలింగ్ గౌతమ్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, కనకమామిడి నరేందర్ గౌడ్, జితేందర్ యాదవ్, ఆనంద్ గౌడ్, సాయికుమార్, రాధాకృష్ణ, పాండు ముదిరాజ్, ప్రవీణ్ యాదవ్, సాయి యాదవ్, హనుమాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

దక్కించుకున్న లడ్డుతో నిమ్మల జగదీశ్వర్ గౌడ్, తండ్రి అనంతరాం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here