నాల్గ‌వ రోజు క‌న్నుల పండువ‌గా న‌వ‌రాత్రులు – ప్రశాంత్ నగర్ కట్టమైసమ్మ ఆలయంలో ప్రభుత్వ విప్ గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాలు, దేవీ మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత నాల్గో రోజున వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయం లో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ గాంధీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, జంగం గౌడ్, శివ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ లోని కట్ట మైసమ్మ ఆలయంలో‌ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ గాంధీ

దీప్తిశ్రీ నగర్ లో శ్రీ ధర్మపురి క్షేత్రం లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు,అర్చన లతో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు శ్రీమహాలక్ష్మికి శ్రీచక్ర పూజలు, కుంకుమార్చనలు చేశారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి దుర్గా మాతను ప్రార్థించాలని, శాంతి, సంపదలను ప్రసాదించాలని లక్ష్మి మాతను పూజించాలని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి పేర్కొన్నారు. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని, యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గామాత అని చండీసప్తసతి చెబుతోందని అన్నారు. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయని చెప్పారు.

దీప్తి శ్రీ నగర్ లోని ధర్మపురి క్షేత్రంలో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారికి పూజ‌లు చేస్తున్న భ‌క్తులు

చందానగర్ డివిజన్ లోని గౌతమినగర్, వేముకుంట శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో‌ ఆలయ కమిటీ నిర్వాహకులు గుర్రపు రవీందర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా నాల్గో రోజు దర్శనమిచ్చారు.

గౌతమినగర్ లోని లలిత పోచమ్మ దేవాలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

గంగారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

గంగారంలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తున్న దృశ్యం

విశాఖ శార‌ద పీఠ‌పాలిత దేవాల‌యాలైన శిల్ప ఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం అమ్మ‌వారు ల‌లితా దేవిగా అదేవిధంగా, అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని శ్రీ అన్న‌పూర్ణ కాశీ విశ్వేష్వ‌ర, సాయిబాబా దేవాల‌యంలో అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అవ‌తార‌ల్లో పూజ‌లందుకున్నారు. ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు ఆచ‌రంచారు.

శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం అమ్మ‌వారు ల‌లితా దేవిగా
అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లో ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here