బిజెపి వైపు యువత చూపు : మారబోయిన‌ రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన యువత

నమస్తే శేరిలింగంపల్లి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు బిజెపి ఇస్తున్న ప్రాధన్యతను చూసి ధర్మ రక్షణకు మేము సైతం అంటూ యువకులు బిజెపి వైపు చూస్తున్నారని రాష్ట్ర బిజెవైఎం కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మర్తాండనగర్, ప్రేమ్ నగర్ లోని యువకులు పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరారు. రాష్ట్ర బీజేవైఎం కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ యువతకు బిజెపి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. బిజెపి కి యువత నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్, సమీర్, బన్ను, నర్సింహా, అనిల్, రాజేష్, హనుమంతు, హరీష్, శివ, సాయి కృష్ణ, రవి, అవైజ్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపిలోకి చేరిన యువతతో రఘునాథ్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here