నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ, శంకర్ నగర్, వేముకుంట, సురక్ష ఎన్ క్లేవ్ తో పాటు పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక మండపల్లో పుజలు నిర్వహించాలని సూచించారు. కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు విఘ్నేశ్వరుడిని పుజించాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.