రూ.20 లక్షల నిధులతో తాగునీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన

నమస్తే‌ శేరిలింగంపల్లి: ఇంటింటికీ మంచినీటి సరఫరా లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆర్ వీ పంచజన్య అపార్ట్ మెంట్ లో రూ. 20 లక్షలతో చేపట్టిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి మంచి నీటి నల్లా కనెక్షన్, స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. గ్రేటర్ పరిధిలో 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నారాయణ, మేనేజర్ సందీప్, ఈఈ శ్రీనివాస్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ , శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింత కింది రవీందర్ గౌడ్, కొండల్ రెడ్డి, కృష్ణ యాదవ్ ,పొడుగు రాంబాబు, రమేష్, వేణు, భాస్కర్, మహేష్, రాజు, భాస్కర్, శ్రీకళ,సౌజన్య, అనిత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి పనులకు శంకుస్థాపన చేసిన‌ ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here