రేపు హైద‌ర్‌న‌గ‌ర్‌లో అభివృద్ధి పనుల‌కు శంకుస్థాప‌న‌లు

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మంగ‌ళ‌వారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. రూ.1 కోటి 60 ల‌క్ష‌ల 95 వేల నిధుల‌తో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వ విప్‌ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ జాన‌కి రామ‌రాజులు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

డివిజ‌న్ ప‌రిధిలోని హైద‌ర్‌న‌గ‌ర్ లో రూ.5 ల‌క్ష‌ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న సీసీ రోడ్డు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు, నంద‌మూరి న‌గ‌ర్‌లో రూ.18 ల‌క్ష‌ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న సీసీ రోడ్డు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు, అదే కాల‌నీలో రూ.7.50 ల‌క్ష‌ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న వ‌ర‌ద నీటి కాలువ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. అలాగే హెచ్ఎంటీ హిల్స్‌లో రూ.19.50 ల‌క్ష‌ల‌తో చేప‌ట్ట‌నున్న డివైడ‌ర్ ప‌నుల‌కు, తుల‌సి న‌గ‌ర్‌లో రూ.50.95 ల‌క్ష‌ల‌తో చేప‌ట్ట‌నున్న వీడీసీసీ రోడ్డు ప‌నుల‌కు, బృందావ‌న్ కాల‌నీలో రూ.25 ల‌క్ష‌ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న వీడీసీసీ రోడ్డు ప‌నుల‌కు, అడ్డ‌గుట్ట‌, తుల‌సి న‌గ‌ర్‌ల‌లో రూ.35 ల‌క్ష‌ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ జాన‌కి రామ‌రాజులు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here