- ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో సమ్మేళనంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, సీత రంజిత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ నారెన్ గార్డెన్ వద్ద ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సీత రంజిత్ రెడ్డి, కాల్వ సుజాతతో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కలిసి పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను విస్మరించారని, కనీసం బాగోగులు కూడా పట్టించుకోలేదని అన్నారు. గతంలో డిసెంబర్ 3న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ 420 ప్రభుత్వాన్ని సెమీఫైనల్స్ లో గద్దె దింపి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, రానున్న మే 13న జరగనున్న ఫైనల్స్ లో గుజరాత్ టీంను ఓడించి తెలంగాణ కాంగ్రెస్ టీంను గెలిపించాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారని, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.