గ‌చ్చిబౌలిలో ఉరి వేసుకుని మ‌హిళ ఆత్మ‌హ‌త్య

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఓ మ‌హిళ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. రాయ‌దుర్గం పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చ‌ల‌సాని శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి త‌న కుమార్తె శిరిష్మ (27)ను 2016లో డిసెంబ‌ర్ నెల‌లో సిద్ధార్థ్ అనే వ్య‌క్తికి ఇచ్చి వివాహం జ‌రిపించాడు. కాగా సిద్ధార్థ్, శిరిష్మ ఇద్ద‌రూ గ‌చ్చిబౌలిలోని ఐకియా స్టోర్ స‌మీపంలో ఎఉన్న డి అడ్ర‌స్ అనే ప్రాంతంలో ఫ్లాట్ నం.906డిలో నివాసం ఉంటున్నారు. శిరిష్మ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా సిద్ధార్థ్ గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. ఈ క్ర‌మంలో ఈనెల 17వ తేదీన రాత్రి 7.30 గంట‌ల‌కు సిద్ధార్థ్ త‌న ప‌ని ముగించుకుని ఇంటికి వ‌చ్చాడు. అదే స‌మ‌యంలో శిరిష్మ ఇంట్లో ఓ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని క‌నిపించింది. దీంతో అత‌ను వెంట‌నే ఆమెను మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అక్క‌డి వైద్యులు ఆమెను ప‌రిశీలించి అప్ప‌టికే ఆమె చ‌నిపోయింద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో స‌మాచారం అందుకున్న రాయ‌దుర్గం పోలీసులు శిరిష్మ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా శిరిష్మ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు.

శిరిష్మ మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here