- 50 మంది విద్యార్థులు అస్వస్థత, 26 మంది చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స..?
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 50 మంది చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగిన వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా దాదాపు 26 మంది విద్యార్థులను పాఠశాల సిబ్బంది కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియు లో చికిత్సనందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఘటనకు గల కారణాలను పాఠశాల సిబ్బంది, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ శారద ను నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు ఏమీ జరగలేదని, ఆరుగురు విద్యార్థులకు వైరల్ జ్వరం రావడం తో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.