దావ‌త్‌ ఇస్తున్న మిత్రుడిపైనే దాడి చేశారు… బీరు బాటిల్ ప‌గుల‌గొట్టి గొంతుకోశారు…

  • చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో క‌ల‌క‌లం రేపిన‌ ఘ‌ట‌న‌
  • కోలుకుంటున్న బాధితుడు – ప‌రారీలో నిందితులు

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: కొడుకు పుట్టిన రోజు సంద‌ర్భంగా దావ‌త్ ఇస్తున్న మిత్రుడుపై అక‌స్మాత్తుగా దాడికి దిగిన ఇద్ద‌రు స్నేహితులు బీరు బాటిల్ ప‌గుల‌గొట్టి అత‌ని గొంతు కోశారు. స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు తెలిపిన వివ‌రాల ప్రకారం… క‌ర్ణాట‌క రాష్ట్రం గుల్భర్గ ప్రాంతానికి చెందిన విజ‌య్‌కుమార్‌(23) బ్ర‌తుకు దెరువుకోసం న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చి పాపిరెడ్డి కాల‌నీలో నివాసం ఉంటు స్థానికంగా సెక్యూరిటీగా ప‌నిచేస్తున్నాడు. అత‌నికి భార్య చాముండితో పాటు ఇద్ద‌రు కుమారులు సంతానం. త‌న పెద్ద కొడుకు ల‌క్ష్మ‌ణ్‌(2) పుట్టిన రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం మిత్రుల‌కు దావ‌త్ ఇద్దాం అనుకున్నాడు విజ‌య్‌కుమార్. ఈ క్ర‌మంలో రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో స్థానికంగా ఆటోడ్రైవ‌ర్‌గా విధులు నిర్వ‌హించే న‌గేష్‌తో పాటు మ‌రో మిత్రుడితో క‌ల‌సి శేరిలింగంప‌ల్లి జోన‌ల్ కార్యాల‌యం ఎదురుగా కొత్త‌గా ఏర్ప‌డిన లింకురోడ్డుకు వెళ్లారు. స్నేహితులే విజ‌య్‌కుమార్‌పై దాడి ఎందుకు చేశారు అనేది మిస్ట‌రిగా మారింది. వైద్యుల సూచ‌న మేర‌కు విజ‌య్‌కుమార్ మాట్లాడ‌లేని ప‌రిస్థితి నేప‌థ్యంలో నిందితులు దొరికితే త‌ప్ప అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డేలా లేదు.

ఘట‌నా స్థ‌లంలో ర‌క్తం మ‌డుగులో ప‌డి ఉన్న విజ‌య్‌కుమార్‌

అక్క‌డ ఒక ఖాలీ ప్ర‌దేశంలో ముగ్గురు క‌ల‌సి మ‌ద్యం సేవించారు. అక‌స్మాత్తుగా నాగెష్‌తో పాటు మ‌రో మిత్రుడు బీర్ బాటిల్ ప‌గుల‌గొట్టి విజ‌య్‌కుమార్ గొంతు కోశారు. దీంతో బాదితుడు గ‌ట్టిగా అర‌వ‌డంతో నిందితులు అక్క‌డి నుంచి ప‌రారయ్యారు. స్థానికులు అక్క‌డికి చేరుకుని 108కు స‌మాచారం అందించారు. దీంతో విజయ్‌కుమార్‌ను స్థానిక కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స చేసిన వైద్యులు విజ‌య్‌ని ఉస్మానియా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు. గొంతుకు తీవ్ర గాయ‌మ‌వ్వ‌డంతో అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం ముక్కు చెవి గొంతు ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు. కాగా ప్ర‌స్థుతం విజ‌య్‌కుమార్ ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డి కోలుకుంటున్న‌ట్టు ఈఎన్‌టీ వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

చికిత్స అనంత‌రం కోలుకుంటున్న విజ‌య్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here