కేంద్ర మంత్రివ‌ర్గంలో ఓబీసీల‌కు ఎన‌లేని గౌర‌వం క‌ల్పించిన ప్ర‌ధాని మోడికి రుణ‌ప‌డి ఉంటాం: రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు 27 మంది ఓబీసీలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మియాపూర్ ఆర్‌బీఆర్‌ కాంప్లెక్స్ వ‌ద్ద‌ నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశ చ‌రిత్ర‌లో ఓబీసీల‌కు కేంద్ర మంత్రివ‌ర్గంలో ఇంత‌టి గౌర‌వం ల‌భించ‌డం మొద‌టి సారి అని అన్నారు. ప్ర‌ధాని మోడి నాయ‌క‌త్వంలో దేశంలోని అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత స్థానం ల‌భిస్తుంద‌ని, 2021 మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అందుకు స‌జీవ సాక్ష‌మ‌ని అన్నారు. ఓబీసీల ఆత్మ‌గౌర‌వాన్ని అర్థం చేసుకున్న మోడీకి బీసీలంతా రుణ‌ప‌డి ఉంటార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు త్రినాథ్ , జిల్లా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ ముదిరాజ్, స్వామి గౌడ్ , కార్యదర్శి భరత్, అధికార ప్రతినిధి రవిగౌడ్, కౌన్సిల్ సభ్యులు మనోహర్, హఫీజ్ పేట్ డివిజన్ ఓబీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర రావు, మియాపూర్ అధ్యక్షుడు మాణిక్ రావు, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, మియాపూర్ ఉపాధ్యక్షుడు రాజరత్నం, హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, మియాపూర్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, అంజయ్య ,చందు, విజయేంద్ర, చిద్దు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మోడీకి పాలాభిషేకం చేస్తున్న ఓబీసీ మోర్చా నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here