నమస్తే శేరిలింగంపల్లి: పని కోసం ఇంటి నుంచి వెళ్లిన భర్త అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ శివాజీనగర్ కాలనీలో ఎర్ర శ్రీనివాస్ తన భార్య ఎర్ర సునీతతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 17 న సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ పనికోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో భార్య సునీత బంధువుల ఇంటి వద్ద, చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య సునీత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. తప్పిపోయిన వ్యక్తి ఇంటి నుండి వెళ్లినప్పుడు తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడని, అతని ఎత్తు 5.5 అడుగులు ఉంటాడన్నారు. తెలుగు, హిందీ భాషలలో మాట్లాడగలడని చెప్పారు.