ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న న‌లుగురి అరెస్ట్

  • రూ.15వేల న‌గ‌దు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న న‌లుగురు వ్య‌క్తుల‌ను చందాన‌గర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీలో ఉన్న చందాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద టీ స్టాల్ స‌మీపంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారం మేర‌కు చందాన‌గ‌ర్ ఎస్ఐ రాములు, ఇత‌ర సిబ్బంది క‌లిసి దాడులు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న వి.శేఖ‌ర్‌, కె.ఎల్ల‌ప్ప‌, ఆర్‌.శివ‌, జి.సునీల్‌ను వారు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15,130 న‌గ‌దు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here