శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోబోయిన ఓ వ్యక్తిని చందానగర్ పోలీసులు కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ రైల్వే ట్రాక్‌పై నిజాంపేటకు చెందిన సురేష్ (31) అనే వ్యక్తి ఆగస్టు 28వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వేగంగా స్పందించారు. దీంతో సురేష్ ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. అనంతరం పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.






